మెదక్ జిల్లా: జనవరి 9, 2023 ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో నాలుగు కోట్ల 98 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైన్ మార్కెట్ యార్డును రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి వహించడం తో గజ్వేల్ రూపురేఖలు మారాయని అన్నారు రైతులు పండించే పంటకు సరైన మార్కెట్ లేని పరిస్థితులలో నేడు మూడు మార్కెట్ లు నిర్మించుకున్నామన్నారు. రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నదని అన్నారు.
ఉచిత కరెంటు, సాగునీరు అందించడంత్తో పాటు పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతు భీమా ఇస్తున్నామన్నారు. రైతు బంధు ద్వారా రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని ఇప్పటివరకు 98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా అందించమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తున్నామని ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్ ల పై నుండి మత్తడి దూకుతున్నదని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశామన్నారు. వృద్దులకు ఆసరా పింఛన్లు, పేదింటి ఆడపిల్లల పెల్లి లకు కళ్యాణాలక్ష్మి అందిస్తున్నానమని మంత్రి తెలిపారు.గత 13 సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న జీడిపల్లి, కాళ్ళ కల్, కుచారం,ముప్పిరెడ్డి పల్లి గ్రామ భూ నిర్వాసితులకు 374 ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం తూప్రాన్ మ్యూనిసిపలిటీలో 22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సి.సి.రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో, ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్, రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక అద్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి,ముప్పిరెడ్డి పల్లి సర్పంచ్ నరాల ప్రబావతి పెంటయ్య, ఎంపీపీ నవనీత రవీ ముదిరాజ్, గడ్డి స్వప్నా వెంకటేష్ యాదవ్, వైస్ ఎంపీపి విఠల్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ లు , ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఆర్డిఓ శ్యాం ప్రకాష్, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post