మంచికి చెడుకు అక్కరకొస్తుండు..

 

మళ్ళీ సంజయ్ నే గెలిపించాలి

నియోజవర్గంలో గ్రామీణ ప్రజల మాట..

జగిత్యాల ప్రతినిధి, జూలై 1,(ప్రజాబలం ) జగిత్యాల చరిత్రలో ప్రజాక్షేత్రంలో ఏ ఎమ్మెల్యే తిరుగని రీతిలో జనంలో తిరుగుతూ మంచి చెడు తెలుసుకొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై గ్రామీణ ప్రజానీకంలో పాజిటివ్ దృక్పధమే కనిపిస్తోంది. మంచి చెడుకు అక్కరకొస్తున్నాడని, అక్కర తెలువగానే పనులు చేసిపెడుతున్నాడని ఎందుకు పోగొట్టుకోవాలన్న అభిప్రాయాలు జగిత్యాల నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తున్న యదార్థమిది. జగిత్యాల ఎమ్మెల్యేగా తొలిసారి నిలబడి ఓటమిని చవిచూసిన ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృంగిపోక తిరిగి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వచ్చాడు. యధావిధిగా ఉచిత కంటి అపరేషన్లతో ఎందరో కళ్ళల్లో వెలుగు నింపడు. ఆ తదుపరి అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి జీవన్ రెడ్డిపై 60 వేల మెజారిటీతో గెలుపొందారు. అప్పుడే అనుకున్నాడో ఏమో నిత్యం జనం మధ్యలో ఉండాలని అందుకే నిత్యం కొన్ని ఊర్లనే ఎమ్మెల్యే చుట్టి వస్తున్నాడు. ఈ పర్యటన లు ప్రజల్లో పాజిటివ్ దృక్పధాన్ని పెంచడానికి దోహదపడుతున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ధీనికితోడు ఒకప్పటి పద్దతులనే మార్చివేసి కళ్యాణలక్ష్మి, షాధిముభారక్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఇస్తుండడం కూడా ప్రజలతో మమేకం చేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఎల్వోసి లను అందజేయడం వంటివి ప్రజల్లో ఎమ్మెల్యేపై సానుకూల అభిప్రాయాలకు దారితీస్తోందన్న అభిప్రాయాలను గ్రామీణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరంతర కరెంట్, రైతుబంధు, సంవృద్దిగా దొరుకుతున్న ఎరువులు వంటివి గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకతకు తావులేకుండా చేస్తోందని పలువురు అంటున్నారు. మరి ఎమ్మెల్యే సంజయ్ పై వస్తున్న ఆరోపణల సంగతేంటి అని గ్రామీణులను ప్రశ్నిస్తే ఇవన్నీ గిట్టని వాళ్ళు చేస్తున్న పుకార్లు అంటూ ప్రజలు కొట్టిపారిస్తున్నారు. అనుకున్నది చేయడం ఎమ్మెల్యే సంజయ్ అభిమతమని అలా లేకుంటే ఈపాటి అభివృద్ధి జరిగేదా అని గ్రామీణ ప్రజానికమే ప్రశ్నిస్తుండడం విశేషం. స్వతహాగా స్థితిమంతుడైన డా. సంజయ్ కు పైసలు సంపాదించాలన్న ఆశ లేదని కేవలం సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చాడన్న అభిప్రాయాలు ప్రజాల్లోనే వినిపిస్తున్నాయి. గతంలో జరగని అభివృద్ధి నేడు కనిపిస్తోందంటున్న జగిత్యాల నియోజకవర్గ జనం అంటుండగా జనాన్ని నమ్ముకొని అభివృద్ధి బాటలో నడుస్తున్న డా.సంజయ్ వెంటే జనం వుంటారేమో వేచి చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

Breaking