శని త్రయోదశి సందర్భంగా తూప్రాన్ లో వీరాంజనేయ స్వామి శనీశ్వరాలయంలో  ప్రత్యేక పూజలు    అధిక సంఖ్యలో హాజరైన భక్తులు ప్రజా ప్రతినిధులు

 

మెదక్ తూప్రాన్  జూలై 1ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పెద్ద చెరువు గట్టు పై వెలసిన వీరాంజనేయ స్వామి శనీశ్వర దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు . హనుమాల గురుస్వామి ఆలయ పూజారి శలక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామికి ఉదయాన్నే పంచామృతా చందన అభిషేకం,  మాన్యుసుక్త పారాయణం,  సింధూర పూజ ఆకు పూజ, శని త్రయోదశి సందర్భంగా ప్రజలు వారి వారి దోషాల నుండి విముక్తి పొందుటకు శనేశ్వర స్వామికి నల్లబట్ట, నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి తైలాభిషేకం పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో  రామనామ భజనతో భక్తి స్మరణతో మార్మోగింది. అనంతరం పండితులు ఆత్రేయ శర్మ మాట్లాడుతూ

ఇక్కడ దేవాలయం  భక్తులకు భక్తితో కోరిన కోరికలు నెరవేరుస్తూ , శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు నువ్వుల నూనెతో భక్తులు పూజలు నిర్వహించి వారి వారి దోషాల నుండి విముక్తి పొందుతున్నారని భగవంతుని దయవల్ల ఎంతోమంది బాగుపడ్డారని వారు వారి కుటుంబీకులతో ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారని ఆపదలో ఉన్న వారికి కలిగయువ దైవం హనుమంతుడని ఉదయాన్నే లేచి దైవారాధన చేస్తే వారికి సుఖసంతోషాలు ఉండునని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దేవాలయానికి    చుట్టుపక్కల గ్రామ ప్రజలు , గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరై భక్తితో పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking