ఉత్తమ వాలంటీర్ గా ఉప్పులేటి గోపిక

కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ప్రశంస పత్రం

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ 27 :

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో ఆదివారం జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మందమర్రి పట్టణానికి చెందిన ఉప్పులేటి గోపిక ఉత్తమ వారింటీర్ గా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. పట్టణంలోని శ్రీపతి నగర్ లో వయోజన విద్యాశాఖ, సఖి లయన్స్ క్లబ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో అక్షరాస్యత కేంద్రం మరియు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసి కోఆర్డినేటర్ గా సేవలందిస్తూ వయోజన మహిళలు విద్య నేర్చుకునేలా ప్రోత్సహించడమే కాకుండా మహిళా సాధికారత కోసం ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నందుకు గాను కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ వాలంటీర్ ప్రశంస పత్రం అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking