జెండా ఆవిష్కరించిన కరిపే అనిల్‌ కుమార్‌

ఘనతంత్ర వేడుకలు
జెండా ఆవిష్కరించిన యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లా కరిపే అనిల్‌ కుమార్‌
ఉప్పల్‌ ప్రజాబలం ప్రతినిధి:వాసవీ నగర్‌ వీధి నెంబర్‌ 1, రామాంతపూర్‌, ఉప్పల్‌ అసెంబ్లీలో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కరిపే అనిల్‌ కుమార్‌ వంజరి జెండా ఆవిష్కరించారు.అనంతరం స్వాతంత్ర భారతావని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్‌ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు.

భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది…కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్‌ డే జరుపుకుంటాము అని గణతంత్ర దినోత్సవం ప్రత్యేకత గురించి కరిపే అనిల్‌ కుమార్‌ వంజరి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్‌, శ్రీనివాస్‌ గుప్తా, ప్రభాకర్‌, కరిపే పరమేష్‌, సంతోష్‌, శ్రీనివాస్‌ చారి, ప్రభాకర్‌ గుప్తా, బండి క్రాంతి, శివ కుమార్‌, మురళి యాదవ్‌, రాము యాదవ్‌, శివరామ్‌ కృష్ణ, వీరేష్‌, కరిపే జనార్ధన్‌, భాష, రాంతేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking