గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 27:
జూలై 1న రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గిరిజన హక్కుల కోసం ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో అనేక డిమాండ్లు సాధించామని తెలిపారు . జరగబోయే జాతీయ సమ్మేళ నంలో గోర్ బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలనే డిమాండ్ తో బెల్లయ్య నాయక్ ఆధ్వరంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం అని తెలిపారు. ఈ గోర్ బంజారా సమ్మేళన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. , ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఓ ప్రధాన కార్యదర్శి విజేందర్ పవార్, కార్యదర్శి జగదీష్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ సంతోష్ నాయక్, గ్రేటర్ హైదరబాద్ అధ్యక్షులు వెంకటేష్ నాయక్, ఓయూ అధ్యక్ష కార్యదర్సులు చందర్, గణేష్, విద్యార్థి నాయకులు కిషన్,రాజు, జంపన్న, సురేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking