నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:భారతీయ మహిళా శక్తికి,ధైర్యసాహసాలకు ప్రతీక. దొరతనం, జామీందారీ వ్యవస్థను అంతంచేసిన ధీశాలి. హరిత విప్లవంతో పంటల ఉత్పత్తిని పెంచిన అన్నపూర్ణ. గరీభీ హటావో’తో పేదరికాన్ని, అసమానతల్ని తగ్గించిన మహానేత. అలీన విధానమే కాదు అణుబాంబు పరీక్షనూ చేపట్టిన ఉక్కుమహిళ. భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్బంగా దేశానికి ఆ మహనీయురాలు అందించిన సేవలను స్మరించుకుంటూ నాంపల్లి గాంధీభవన్‌లో వారికివే ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు ఎం.భధ్రీనాద్ బేగంబజార్ డివిజన్ అధ్యక్షులు టీ.శ్యాంసింగ్ , మహవీర్ సింగ్ ,సి.కిషన్ ,శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గోన్నారు.