జాన్ & సామ్యూల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు
ముఖ్యఅతిథిగా హాజరై ఆశీర్వదించి దీవించిన కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజు
తూప్రాన్, నవంబర్, 18
ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ మండలం పోతరాజుపల్లి పిలదెల్పియా చర్చిలో ఆదివారం ఉదయం రెవరెండ్ పాస్టర్ బెన్నీ శ్రీలత ల కుమారులు జాన్ , సామ్యూల్ ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పిలద్దెల్పియా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్య రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ జాన్ మరియు మాస్టర్ సామ్యూల్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య ప్రసంఘకులుగా బ్రదర్ పీటర్, బ్రదర్ దానియేలు, వర్తమానం అందించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్, గడ్డం ప్రశాంత్ కుమార్, చేలిమెలా రామస్వామి లు హాజరై బర్త్ డే కేక్ కట్ చేసి పుట్టిన రోజు దీవెనలు అందించారు. ఈ సందర్భంగా బుడ్డ భాగ్యరాజు మాట్లాడుతూ చిన్నారులు జాన్ మరియు సామ్యూల్ లు కల కాలం నిండు నూరేళ్ళు అయూర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చిరంజీవులు మాష్టర్ జాన్, మాష్టర్ సామ్యూల్ లను ఆశీర్వదించి దీవించారు. ఈ కార్యక్రమంలో పిలదేల్పియా ప్రార్థన మందిరం ఫాస్టర్ బెన్నీ, శ్రీలత లతో పాటు బ్రదర్ కుమార్, ప్రభాకర్, లక్ష్మణ్, ప్రవీణ్, ఏసుదాస్, విజయ్ కుమార్, సుబ్బారావు, నరేష్, హోసన్నా, ప్రదీప్, అనంతరావు, సాయి, శేఖర్, వినయ్, రమేష్, డేవిడ్, మహేష్, శ్రీశైలం, సిస్టర్స్ సుశీలమ్మ, ఇందిరమ్మ, పుణ్యవతి, మహేశ్వరి, లక్ష్మి, సమాధానం, మరియమ్మ, సుసన్న, రజిత, లక్ష్మి, కృప జ్యోతి, విజయ, శోభ, ఎలమంద, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ తో పాటు ఇంకా అనేక పెద్దలు, దైవజనులు పాల్గొన్నారు.