రెడీ మిక్స్ ప్లాంట్ తరలింపు డిమాండ్.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 నవంబర్ 2024
మణికొండ మునిసిపల్ పరిధిలోని మై హోమ్ అవతార్, హాల్ మార్క్ విసీనియాలో దాదాపు 15,000 మంది జనాభా గల గృహ సముదాయాల ప్రక్కనే క్యాప్టివ్ రెడీ మిక్స్ ప్లాంట్ నెలకొల్పి కాలుష్యం వెదజల్లుతున్న దరిమిలా స్థానిక ప్రజలు ప్రత్యేకముగా పిల్లలు, వయసు మళ్ళిన వృద్దులు పొల్యూషన్ తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని పలు మార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారికి, ప్రజా ప్రతినిధులకు పిర్యాదు చేసిననూ నిమ్మకు నీరెత్తినట్లు గమ్మున ఉండడం బోర్డు ప్రత్యేతగా కొనసాగుతున్న తరుణంలో స్థానిక ప్రజలు ఎదురు కొంటూన్న ఇతి భదలను ఇంకా ఎవరికి చెబితే తమకు పరిష్కారం అవుతాదో అని చకోర పక్షుల్లా ఎదురు చూడడం తప్ప తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులకు వ్యతిరేకంగా చుట్టు పక్కల ఉండే ప్రజానీకానికి ఇబ్బందులకు గురిచేస్తూ రెడీ మిక్స్ ప్లాంట్ నడపడం సరికాదని భారత సర్వోత్తమ న్యాయస్థానం తీర్పుల రూపంలో ఇట్టి చర్యలను రాష్ట్ర ప్రభుత్వావాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చర్యలను తీసుకోవాలని, సమస్య తీవ్రతను బోర్డుకు పిర్యాదు చేయగా అందుకు నిపుణుల కమిటీ పిర్యాదును స్వీకరించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు 8 నవంబర్ 2024 రోజున ఇరుపక్కలా వాదనలు విని పరిష్కార మార్గం తెలుపుతామని అట్టి విషయంలో కూడా సడీ సంబంధం లేకుండా ప్రక్కకు తోసిరాజని పెట్టడం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకే సాధ్యపడుతుందని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరీఫ్ మొహమ్మద్, ఉప కార్యదర్శి బొమ్ము ఉపెంద్రనాద్ రెడ్డి ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking