ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జనవరి6:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి,రైతు భరోసా,చేయూత,గృహజ్యోతి మరియు ఇందిరమ్మ ఇండ్లు మొదలైన పథకాలను పొందడానికి సభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.63 డివిజన్ వాటర్ టాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేద వారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని,అదేవిధంగా మెరుగైన రాజీవ్ ఆరోగ్య శ్రీ పతాకాన్ని కూడా అమలు చేసామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేస్తోందని,ప్రజలకు హామీనివ్వడం జరిగంది.గత పదేళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.ప్రజలకు చేరువగా పాలనన అందించడానికి తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వుం కట్టటబడి ఉంది అని అన్నారు.అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలను చేపడుతుంది,రాష్ట్రంలోని నిజమైన లబ్దిదారులకు దశల వారీగా,నిర్ణీత కాల వ్యవదిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ఆరు గ్యారంటి నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి,62 వ డివిజన్ కార్పో రేటర్ జక్కుల రవీందర్ యాదవ్, కాజీపేట తహశీల్దార్ భావుసింఘ్ మాజీ కార్పోరేటర్ గుంటి కుమార్, సుంచు అశోక్,టిపీసిసి కార్యదర్శి సయ్యద్ రజాలి,మహమ్మద్ అంకుష్, క్రాంతి భరత్,డివిజన్ అధ్యక్షులు పోగుల సంతోష్,పాలడుగుల ఆంజనేయులు,షేక్ అజ్గర్,కొండా శివ, టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ కొ-ఆర్డినేటర్ మోసేస్ పాల్ ఆనంద్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్,మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.