ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జనవరి6:వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం నందు ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు.అనంతరం అధికారులందరికీ శాలువాతో ఎమ్మెల్యే సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వారికి అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇస్తూ దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను వారు సూచించారు. ప్రజలందరూ ఆగం కాకండి ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం అయితే ఇంకా కొన్ని రోజులు పెంచుకుందామని అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,గ్రామ శాఖ అధ్యక్షుడు దాడి రమేష్,వరంగల్,హనుమకొండ జిల్లాల కిసాన్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్రావు,పింగిలి వెంకట నర్సయ్య రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంపిటిసి,జెడ్పీటీసీ, స్పెషల్ ఆఫీసర్,ఎమ్మార్వో,ఏఈ,డిఈ, గ్రామ కార్యదర్శి,అంగన్వాడి,ఆర్పీలు, ఆశా కార్యకర్తలు,కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.