ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జనవరి6:ఆత్మకూర్ మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ పరమేశ్వర దివ్య శివలింగ సహిత గణపతి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు.అనంతరం దేవాలయ పూజారులు పూర్ణకుంభంతో ఆహ్వానించి ఆశీర్వచనలు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో శ్రీ పరమేశ్వర దివ్య శివలింగ సహిత గణపతి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకోవడమే కాక పోచమ్మ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అత్యంత వైభవంగా నిర్వహించుకోవటం ఆనందకరమన్నారు.గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన వలన గ్రామంలో ఐక్యత,శాంతి సౌభాగ్యాలకు నిలయంగా ఉంటుందన్నారు.ఆ శివుని ఆశీస్సులతో గ్రామ ప్రజలతోపాటు నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.