సీఎంని కలిసిన ప్రో.గాదె దయాకర్

 

 

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జనవరి6:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ గాదె దయాకర్ శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందిచడం జరిగింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రచార కో-ఆర్డినేటర్ గా అవకాశం ఇచ్చినందుకు గాను రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.అదే విధంగా తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినందుకు దయాకర్ ని ముఖ్యమంత్రి అభినదించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉన్నత విద్యను, విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని,గత రెండున్నరేల్లుగా యూనివర్సిటీలో వీసీ ల పాలన అస్తవ్యస్తంగా వుందని వెంటనే ఉన్నత విద్యకు న్యాయం చేయాలని అన్నారు.ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అన్ని వర్గాల పేద విద్యార్థిని, విద్యారులకు కాంగ్రేస్ ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించే దిశగా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking