వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో దేశంలో ఉన్న అసమానతలను తొలగించి కుల గణన చేయాలని సంకల్పించారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేయడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని దాన్ని చట్టంగా మార్చి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరడమైనది. నాడు రాహుల్ గాంధీ పోరాటం, రేవంత్ రెడ్డి ఆలోచన దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని సంకల్పించారు. నేడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నాం . కుల గణన చేయడం ద్వారా మన రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. వెనుకబడిన వర్గాల లెక్క తేల్చి వారికి ఉద్యోగ, విద్యా రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలని భారత్ జోడోయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సంకల్పించారు.
బీసీ బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రవేశపెడితే బలపరిచే అవకాశం నాకు లభించింది అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వహించి, బీసీల సంఖ్య 56.36 శాతంగా లెక్క తేల్చారు.
బీసీ బిడ్డలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నాము.
కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.
జంతర్ మంథర్ వద్ద ధర్నాలో వివిధ పార్టీల ఎంపీలు వచ్చి మద్దతు తెలపడం జరిగింది.
దేశంలోనే పలు రాష్ట్రాల్లో కుల గణన చేస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానించాయి.
దేశంలో కుల గణనపై జరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేక బిజెపి ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆనాడు కుల గణన చేసి వారి రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు.
తప్పని పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం దిగి వచ్చింది.
బిజెపి, బి ఆర్ ఎస్ వారు మేము చేసిన కుల గణనపై తప్పుడు ఆరోపణలు చేశారు.
ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలని ఆయన కోరారు.
రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.