78 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ జాతీయ జెండాను ఎగురవేశారు. మొదట జాతీయ నేతలైన జాతిపిత మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ల చిత్రపటాలకు పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం భారతమాతకు జై అంటూ పలువురు న్యాయవాదులు నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి వి రాజకుమార్, అదనపు జిల్లా న్యాయమూర్తులు, సబ్ జడ్జి, మేజిస్ట్రేట్స్ , ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ప్రభుత్వ న్యాయ వాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ర్స్, సీనియర్, జూనియర్ న్యాయ వాదులు, మహిళ న్యాయవాదులు, న్యాయ వాద గుమస్తా లు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు, పాల్గొన్నారు.