అంబేద్కర్ నగర్ మాల మహానాడు ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షుడు కొచ్చర్ల వెంకటాద్రి

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆగస్టు 15

78 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం అంబేద్కర్ నగర్ ప్రధాన కూడలిలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని పాడిన మాల మహానాడు అధ్యక్షుడు కొచ్చర్ల వెంకటాద్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ మాల మహానాడు ఉపాధ్యక్షుడు బొంతల సుధాకర్,ప్రధాన కార్యదర్శి యాట సంజీవ,కార్యవర్గ సభ్యులు తుంగ జనార్ధన్, ఏ సుబ్బు, కోటేశ్వరరావు, సత్యానందం, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking