గౌండ్ల మఠం శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు

హైదరాబాద్ ఫిబ్రవరి 19 ;పురానాపూల్ రహీంపురాలోని సురాభాండేశ్వర గౌండ్ల మఠం శివాలయంలో రెండు రోజులుగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలను అత్యంత వైభవోపేతంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. “సురాబాండేశ్వర గౌండ్ల మఠం అధ్యక్షుడు నరేష్ గౌడ్, ప్రధానకార్యదర్శి కొత్త నవీన్ కుమార్ గౌడ్, సలహాదారులు ఎన్ నీలకంఠం గౌడ్, ఉపాధ్యక్షుడు గడ్డమీది యజ్ఞేశ్వర్ గౌడ్ (రాజు), ప్రతినిధులు బాస్కర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ తదితరుల నేతృత్వంలో ఆలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు, మహా రుద్రాభిషేకం సాంస్కృతిక జాగరణ కార్యక్రమాలు నిర్వహించారు అదివారం కూడా ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఉపవాస దీక్షలు చేపట్టి మహాదేవుడి సేవలో తరించిన భక్తజనం అన్నప్రసాదాలు స్వీకరించేందుకు పెద్దసంఖ్యలో . తరలిరావడంతో గౌండ్ల మఠం కిటకిటలాడింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking