నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

 

సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథి జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఈ రోజు నిర్మల్ పట్టణం లొ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు
ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు అవినాష్ కుమార్,ఐపిఎస్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి డిఎస్పీ గంగా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన,సాంస్కృతిక పండుగ అని అన్నారు.ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా వైభవంగా జరుపుకుంటారని తెలిపారు.ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా జిల్లా పోలీస్ సిబ్బంది అందరూ వినాయక చవితి,దసరా, దీపావళి,రంజాన్, బక్రీద్ వంటి పండుగలు జరుపుకోవటం చాలా అనందిస్తాయి.ప్రతి రోజూ డ్యూటీ లో బిజీ గా ఉంటూనే ఇలాంటి అన్ని పండుగలను జరుపుకోవాలని కోరారు.కుటుంబంలో అందరూ కలసి అన్ని పండుగలు జరుపుకోవాలి.
అనంతరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు.
ఈ వేడుకలలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి,ఏఎస్పి అవినాష్ కుమార్, డిఎస్పీ గంగారెడ్డి,ఏ ఓ యూనిస్ అలి, ఇన్స్పెక్టర్ లు నవీన్ కుమార్,నైలు,సైదా రావు, రామ కృష్ణ , మల్లేష్,కృష్ణ,రమణ రావు
ఆర్ ఐ లు రాం నిరంజన్ రావు, రమేష్, రామ కృష్ణ, ఎస్ఐ లు ప్రదీప్, నరేష్, లింబాద్రి, సందీప్ కె, గోపి, శ్రీకాంత్,సందీప్ ఏ, సాయి కుమార్, సాయి కిరణ్,అశోక్,సాగర్, ఆర్ ఎస్ఐ లు వినోద్, రవి కుమార్,రాజ శేఖర్,రవి ఎం,డిపిఒ సిబ్బంది,ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking