గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 19 (ప్రజాబలం) ఖమ్మం గ్రీవెన్స్ డే ను పురస్కరించుకొని నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలిస్తూ ఆయా శాఖాధికారులకు కలెక్టర్ ఫార్వార్డ్ చేశారు ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం రెవెన్యూ పరిధిలో సర్వేనెం. 402/35/1/1,లో 33 కుంటలు మిస్సింగ్ సర్వేనెంబరుకు సంబంధించి, తిరుమలాయపాలెం మండలంకు చెందిన మిట్టకోల భద్రయ్య తనకు హస్నాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వేనెం.116/ఈ ఎకరం 20 కుంటలు పట్టాల్యాండ్ నుండి అసైన్డ్ ల్యాండ్‌గా నమోదు కాబడినదని సమర్పించిన దరఖాస్తును, తిరుమలాయ పాలెం మండలం బీరోలుకు చెందిన మన్నెపల్లి అశోక్ తనకు బీరోలు రెవెన్యూ పరిధిలో సర్వేనెం.131/ఎ2, 135/ఎ1/2లో గల భూమిని నిషేధిత జాబితాలో నమోదు కావడం జరిగినదని సమర్పించిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపారు వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన గత్తం మౌనిక, దారా కృష్ణవేణి, కట్టా రాజకుమారి, దారా నాగకన్య మర్లపాడు గ్రామం, అంబేద్కర్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ సరిగాలేద ని ఎలాంటి పోషకాహారం అందించడం లేదని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. మధిర మండలంకు చెందిన యలగందుల గోపిచంద్ తనకు బ్రెయిన్ ట్యూమర్ వల్ల కండ్లు కనిపించడం లేదని తనకు 30 శాతం సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగినదని, తనకు ఎటువంటి పింఛను రావడం లేదని తన కండ్లను పరిశీలించి సదరన్ సర్టిఫికేట్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృది అధికారికి సూచించారు. ఖమ్మం నగరం కొత్తగూడెంకు చెందిన వరికుప్పల కృష్ణవేణి తమకు ఖాళీ స్థలం ఉన్నదని, ఆర్ధిక స్తోమత లేక ఇంటి నిర్మాణం చేయలేక పోయామని ఇంటి నిర్మాణం కొరకు మహాలక్ష్మి పథకం క్రింద ఆర్ధిక సహాయం అందించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన నిమిత్తం ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్‌కు సూచించారు. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంకు చెందిన పిల్లి భాస్కర్ తనకు పట్టా నెం.198, సర్వేనెం.1856/73లో ఒక ఎకరం మెరక భూమి కలదని, అట్టి భూమి పహణీ కోసం దరఖాస్తు చేయగా తమ నాయనమ్మ పిల్లి శాంతమ్మ పేరుమీద వచ్చినదని, తమ పేరున మార్చి పాస్ బుక్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తహశీల్దారు ఆదేశించారు తిరుమలాయ పాలెం మండలం జూపెడ గ్రామంకు చెందిన దొడ్డ శ్రీనివాసరెడ్డి తనకు జూపెడ గ్రామంలోసర్వేనెం.162లో 3 ఎకరముల భూమి కలదని అట్టి భూమినుండి దారి ఇవ్వడంతో విభేదాలు తలెత్తడం జరుగుచున్నదని అట్టి భూమిని సర్వే చేసి డొంక మార్గం చూపించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడిని ఆదేశించారు గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్.సన్యాసయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.