ఖమ్మం జిల్లాకు భారీగా ఎంపీ నిధులు ఎంపీ నామ

 

ఖమ్మం మధిర పాలేరు నియోజకవర్గాలకు రూ. 2,10,60,000 మంజూరు

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడి

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని స్థానిక పార్టీ ప్రజా ప్రతినిధులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఎంపీ నిధులు మంజూరు చేశామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీసీ రోడ్లు, కల్వర్టులు, స్కూళ్లు, అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎంపీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఖమ్మం మధిర పాలేరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కోసం తాజాగా రూ 2 కోట్ల10 లక్షల 60 వేల ఎంపీ నిధులు విడుదల చేశామని లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు వెల్లడించారు రఘునాధపాలెం మండలం మల్లేపల్లి, బాద్యా తండా, హర్యాతండా, మధిర మండలం కృష్ణాపురం, నాగవరప్పాడు, ఇల్లూరు, ముదిగొండ మండలం పెద్దమండవ, ఖానాపురం, వల్లభి, గోఖినే పల్లి, ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం, అయ్యవారి గూడెం, ఇనగాలి, జమలాపు రం, కొత్తపాలెం, నర్సింహా పురం, భీమవరం, బోనకల్లు మండలం గోవిందా పురం, రావినూతల, నారాయణ పురం, పెద్దబీరవల్లి, చింతకాని, మండలం ఆనంతసాగర్, పాతర్లపాడు, బొప్పారం, నాగులవంచ, నాగిలిగొండ, నేలకొండపల్లి మండలం సదాశివపురం, తిరుమలాయ పాలెం మండలం జల్లెపల్లి, ఎర్రగడ్డ, భద్రాద్రి కొత్తగూడెం బాబు క్యాంప్ , జూలూరుపాడు మండలం పాపకొల్లు ( కొత్తూరు ) గ్రామాల్లో మంజూరైన ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభిస్తామని , ఖమ్మం పార్లమెంట్ నియోజ కాభివృద్ధికి పెద్ద ఎత్తున ఎంపీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఎంపీ నామ చెప్పారు. ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం…గ్రామాల పురోభివృద్ధి కి భారీగా ఎంపీ నిధులు ఖర్చు చేసినట్లు ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking