-ప్రజాబలంతో పరకాల వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా సెప్టెంబర్16: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ లక్ష్మీ పథకం ప్రతి ఒక్కరికి ఆనంద నిలయంగా వర్ధిల్లుతుందని పరకాల వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు.ఇలాంటి పథకాలు పేదల పాలిట వరంగా మారుతుందని ఆయన ప్రజాబలం ప్రతినిధితో చెప్పారు.శనివారం ఆయన నాగారం గ్రామాన్ని సందర్శించి గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.నాగారం గ్రామంలో 70 ఇళ్లకు గాను పది ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నవి. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కానుగుల రమ-రవి లకు చెందిన ఇల్లు బెడ్ లెవెల్ కి నిర్మాణం జరగడంతో ఎంపీపీ హర్షం వ్యక్తం చేశారు. సింగిల్ విండో కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ నాగయ్య మాట్లాడుతూ పది ఇళ్ల పనులు పిల్లర్ల నిర్మాణంతో కార్యరూపం దాల్చుతున్నవని ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు ఇంత వేగవంతంగా జరగడానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే నిజమైన నాయకుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి అని ఆయన కొనియాడారు. కాగా స్థానికుడైన కానుగుల రమ-రవి లకు చెందిన ఇల్లును స్థానిక నాయకులు,గ్రామస్తులు పరిశీలించారు.వేగవంతంగా జరుగుతున్న ఈ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్,మండల కోఆర్డినేటర్ మద్దెల బాబు,పాలకుర్తి దిలీప్,ఆకారపు రజినీకర్,కుక్కల శంకర్,బొమ్మకంటి శంకర్,పసుల సంపత్,బండారి చంద్రమౌళి,గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.