ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 25:దుండిగల్ లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న గ్రూప్ – 1 పరీక్ష నిర్వహాణను శుక్ర వారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం తనిఖీ చేసారు. పరీక్ష ప్రశాంతంగా జరుగుతుందా, సిసి కెమెరాలు పని చేస్తున్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష గదులలో తిరిగి పరీక్షల నిర్వహాణను పరిశీలించారు. ఈ పర్యటనలో దుండిగల్ తహసిల్దార్ మతిన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు