బెదిరింపులతో లొంగతీసుకోలేరు ఎంపీ వద్దిరాజు

పెంట్యాల పుల్లయ్య అక్రమ అరెస్టును ఖండించిన ఎంపీ రవిచంద్ర

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా చింతకాని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య పై అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేయడం ద్వారా అధికార పార్టీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు చర్యలతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు లొంగతీసుకోలేరని ఆయన పేర్కొన్నారు. పుల్లయ్య ను అన్యాయంగా అరెస్టు చేసి, జైల్లో నిర్బందించడం పట్ల ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్యగా స్పష్టం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను, న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వీటిని ప్రజలు ఏ మాత్రం హర్శించరు. అరెస్టు సందర్భంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైరా పోలీసు అధికారులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పుల్లయ్య అరెస్టును తట్టుకోలేక ఆయన భార్య గుండెపోటుతో కుప్ప కూలినా.. అధికార పార్టీ నేతలు మానవతా విలువలను మరిచారని విమర్శించారు. ప్రజల మద్దతుతో ఇలాంటి చర్యలకు గుణపాఠం చెబుతామని అన్నారు. పుల్లయ్య పై పెట్టిన తప్పుడు కేసు ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking