రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్
కార్వాన్ ప్రజాబలం ప్రతినిధి: మాసబ్ ట్యాంక్12, డిసెంబర్ 2024:
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన
H- CITI ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలనీ
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ అధికారులకు సూచించారు.
గురువారం NIUM లో H- CITI లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ. 3,500 కోట్లతో చేపట్టనున్న 38 రోడ్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు లు, రూ.150 కోట్లతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనుల వేగంగా పనులు ప్రారంభించి, పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్య కార్యదర్శి దిశా నిర్దేశం చేశారు.
H- CITI ఫేజ్ -1 లో భాగంగా రూ.1230 కోట్లతో చేపట్టే కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై ఓవర్లు అండర్ పాసుల నిర్మాణానికి టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్య కార్యదర్శి అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు క్రింద చేయాల్సిన భూ సేకరణ , పరిహారం పై నివేదిక అందజేయాలని సూచించారు.
125 ట్రాఫిక్ జంక్షన్ ల లో అడ్డుగా ఉన్న 4,100 విద్యుత్ పోల్ లను 3 నెలల్లోగా తరలించి జంక్షన్ ల అభివృద్ధి , సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు.
పనులను వేగంగా చేపట్టేందుకు ఇంజనీరింగ్, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్, వాటర్ బోర్డు, టెలికాం, టౌన్ ప్లానింగ్,
సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల అధికట్
” H- CITI ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కో-ఆర్డినేషన్ కమిటీ ” నీ ఏర్పాటు చేయాలనీ ముఖ్య కార్యదర్శి GHMC కమిషనర్ ఇలంబరితికి సూచించారు.
ప్రతి ప్రాజెక్టు కు సంబంధించి రోడ్డు అభివృద్ధి ప్రణాళిక ను రూపొందించాలని ఇంజనీర్ లను ఆదేశించారు.
ప్రాజెక్టు పనులు చేపట్టాల్సిన ప్రదేశంలో ఏమేం యుటిలిటీస్ ఉన్నాయో పరిశీలించి టెండర్ పూర్తి అయి ఏజెన్సీ పనులు చేపట్టే లోగా వాటిని పనులు చేపట్టే లోగా షిఫ్ట్ చేయాలన్నారు. ప్రతి ప్రాజెక్టు కు సంబంధించి
చేపట్టాల్సిన భూ సేకరణ, చెల్లించాల్సిన పరిహారంను అంచనా వేసి నివేదిక అందజేయాలని ముఖ్య కార్యదర్శి GHMC అదనపు కమిషనర్ కిల్లు శివ కుమార్ నాయుడు కు సూచించారు.
వచ్చే గురువారం NIUM లో ఇదే అంశం పై సమావేశం నిర్వహిస్తామని … సంబంధిత EE ప్రతి వర్క్ ప్రాజెక్టు కు సంబంధించి పనులు వేగంగా చేపట్టేందుకు దశల వారీగా
తీసుకునే చర్యల పై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆదేశించారు.
సమావేశంలో addl cp ట్రాఫిక్ విశ్వ ప్రసాద్
MD, TGSPDCL – శ్రీ. ముషారఫ్ అలీ ఫరూకీ, వాటర్ బోర్డు md అశోక్ రెడ్డి,
జోనల్ కమిషనర్ – ఖైరతాబాద్, అనురాగ్ జయంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్,
వాటర్ బోర్డ్ ED మయాంక్ మిట్టల్,పబ్లిక్ హెల్త్ ENC ఎం. దేవానంద్
GHMC చీఫ్ సిటీ ప్లానర్ – కె. శ్రీనివాస్
చీఫ్ ఇంజనీర్ (మెయింటెనెన్స్ – భాస్కర్ రెడ్డి
GHMC 6 జోన్ల SE లు పాల్గొన్నారు.