పంచాయతీ రాజ్ మంత్రి కలిసిన ఈజీఎంఎంఉద్యోగులు.
సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారిని తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాలో గత 18 సంవత్సరాలుగా పై బడి విధులు నిర్వహిస్తున్న ఈజీఎంఎం కాంట్రాక్టు ఉద్యోగులు కలిశారు. ఈసందర్భంగా మంత్రి గారికి వినతి పత్రం అందించి
తమకు హెచ్.ఆర్. పాలసీ, వేతన స్థిరీకరణ, పే స్కేల్ చేయాలని, పదోన్నతులు కల్పించాలని కోరారు.
గత నాలుగు సంవత్సరాలుగా మాకు రావల్సిన 6శాతం వేతన పెంపుదల నిలిపి వేశారు అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం- పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ Ê ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ పరిదిలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ %డ% మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం)లో 2002 నుండి ఎస్‌హెచ్‌జీ కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు మరియు గ్రామీణ నిరుద్యోగ యువతకు గత 18 సంవత్సరాలుగా వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, జాబ్ మేళాలను నిర్వహించి వివిధ రంగాలలో ఉపాధిని కల్పిస్తున్నామని వారు తెలిపారు
మేము అపార్డ్ తో పాటు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియామకం అయ్యామని గౌరవ మంత్రి గారికి తెలియజేశారు. మాకు హెచ్‌ఆర్ పాలసీ ఇచ్చేందుకు గత 10 సంవత్సరాల క్రితం ఈసీ మీటింగ్ లో అనుమతి లభించింది. కాని ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జీ.ఓ జారీ చేయబడలేదు అని వారు వివరించారు. ఉన్నత చదువులు చదివి గ్రామీణాభివృద్ధి శాఖలో అతి తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్నామని, కాంట్రాక్టు ఉద్యోగం లో చేరితే మంచి అవకాశాలు ఉంటాయని చాలా సంవత్సరాలుగా ఇందులో పని చేస్తున్నామని తెలిపారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణ నిర్వహించాలన్న, జాబ్ మేళాలు నిర్వహించాలన్న కేవలం ఈజీఎంఎం మాత్రమే ఉండేది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అనేక శిక్షణ సంస్థలు వచ్చి ఈజీఎంఎంకార్యక్రమాలు నడవడం లేదు అని అందుకే వీరిని గ్రామీణాభివృద్ధి శాఖలోని ఇంతకుముందు ఎస్‌ఈఆర్‌పీ లో భాగంగా ఉన్న ఈజీఎంఎంను తిరిగి ఎస్‌ఈఆర్‌ప సంస్థ నందు కలపాలి అని వారు మంత్రి గారిని వేడుకున్నారు.
ఈకార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు జేడీఎం శ్రీనివాస్, సాయి, అమర్ నాధ్, బాలరాజు, అంజన్, కిరణ్, వేణు, గణేష్, సందీప్, రవి, సల్మాన్ మంత్రి గారిని కలవడం జరిగింది.