అక్రమంగా ఆక్రమించిన పట్టా భూమిని ఇప్పించండి

 

చంపుతానని బెదిరిస్తున్న మాటేటి నాగేశ్వరావు, యర్రా గోపీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

విలేకరుల సమావేశంలో బాధితుడు పద్మం వెంకటేశ్వర్లు

ఖమ్మం ప్రతినిధి జనవరి 4 (ప్రజాబలం) ఖమ్మం పట్టా పాస్ బుక్ కలిగిన ఎకరం 13 కుంటల భూమిలో 9 కుంటల భూమిని అక్రమంగా ఆక్రమించుకొని పెద్దల సమక్షంలో అడిగితే చంపుతానని బెదిరిస్తున్న మాటేటి నాగేశ్వరరావు, యర్రా గోపీలపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఖమ్మం శ్రీనివాసనగర్ కు చెందిన పద్మం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఖమ్మం అర్బన్ మండలం, దంస్లాపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ : 32/అ లో ఎకరం భూమి, సర్వే నెంబర్ : 32/ఇ/1లో 13కుంటలు భూమి మొత్తం కలిపి ఎకరం 13కుంటల వ్యవసాయ భూమిని యర్రా శైలజ, భర్త యర్రా గోపి వద్ద నుండి నా భార్య పద్మం రమాదేవి పేరుమీద కొనుగోలు చేసి 6526/2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపాడు. భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా వద్దనే ఉన్నాయన్నారు. నా చిన్న కుమార్తె వివాహము నిమిత్తం సదురు భూమిని విక్రయించదలసి సర్వే చేయించగా సదరు భూమి ఎకరం 13 కుంటలకు గానూ ఎకరం 4 కుంటల భూమి మాత్రమే ఉన్నదని సర్వేయర్ రిపోర్టు ఇచ్ఛాడన్నాడు. మిగతా 9 కుంటల భూమి కార్పొరేటర్ మాటేటి అరుణ భర్త, మాటేటి నాగేశ్వరరావు ఆక్రమణంలో ఉందని తెలిపారు. పెద్ద మనుషుల సమక్షంలో అడిగితే యర్రా గోపి ప్రోద్బలంతో మాటేటి నాగేశ్వరరావు చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ లకు కూడా ఫిర్యాదు చేశానని, సదరు భూపత్రాలు పరిశీలించి, సర్వే నిర్వహించి, మా భూమిని మాకు అప్పగించి, చంపుతానని బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పద్మం వెంకటేశ్వర్లు వేడుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking