ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

….ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి జిల్లా కమిటి.

సంగారెడ్డి ఫిబ్రవరి 19 ప్రజాబలం ప్రతినిధి
పోరాటయోధుడు , ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా సంగారెడ్డి పట్టణంలోని బై పాస్ రోడ్డు శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ వందల ఏండ్ల క్రితమే మన దేశం లో రైతుల కోసం సంస్కరణలు అమలు చేసిన పాలకునిగా, అదే విదంగా వలస పాలకుల నుండి మన దేశ సంస్కృతి వనరులను రక్షణ కోసం అనేక యుద్దాలను చేసిన పోరాట వీరుడు గా నిలిచినా పోరాటయోధునిగా నిలిచిన రాజుగా చరిత్రలో ఎక్కినారని అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ఆయనా జీవిత చరిత్ర ను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై,అవినీతి దీపిడి, సామజిక వివక్ష పై పోరాటం చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాఅధ్యక్షు డు సజ్జద్ ఖాన్ ,ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు సాయి వరాల, రాము, సీ హెచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking