ఉమ్మడి మెదక్ ఫిబ్రవరి 19 ప్రజాబలం:
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని సంగుపల్లి గ్రామంలో జరుగుతున్న చండీశ్వర కామరతి బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కురుమలు నీతి నిజాయితీపరులని మాట తప్పనివారుగా కురుమలు ఉన్నారని పదేళ్ల కెసిఆర్ ప్రభుత్వంలో కురుమలకు కెసిఆర్ ఉన్నత స్థానం కల్పించాడన్నారు. బీరప్ప దేవాలయాలు ఫంక్షన్ హాల్స్ కుల సంఘ భవనాలు ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం కురుమలకు చేసిందని తిన్నరేవు తలిసే వారిగా కురుమలు ఉంటారన్న నమ్మకం సమాజంలో ఉందన్నారు. బీరప్ప కామరతి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నందుకు కురుమ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున బంధువులతో నిర్వహించే పండుగలో ప్రేమాభిమానాలతో పాటు విలువలు భవిష్యత్ తరాలకు అందించడం లో బీరప్ప పండుగలు దోహదపడతాయన్నారు. హైదరాబాదు కోకా పేటలో 5 ఏకరాల్లో అత్యాధునిక కురుమల ఆత్మీయ భవనం దొడ్డి కొమురయ్య భవనం కెసిఆర్ కట్టించాడని కురుమలు నిత్యం కెసిఆర్ తో ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పుష్ప నగేష్ మాట్లాడుతూ కుల బంధువులతో అంగరంగ వైభవంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిపే బీరప్ప పండుగలు సమాజ హితం కొరుతామన్నారు.గ్రామ పెద్దలు పుల్ల బీరయ్య , యాదగిరి మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఎన్.సి. స్థానిక కౌన్సిలర్ బబ్బురి రజిత , హైకోర్టు అడ్వకేట్ టి రాజు , పులి బాలచంద్రం నాగయ్య , కనకయ్య, కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి , మాజీ సర్పంచ్ అయ్యలం, ch లింగం,ఎల్లయ్య, బీరప్ప , కర్రల్ల యాదగిరి, కామల్ల బీరప్ప , కన్నా,మహంకాళి నరేష్, బండారి కిష్టయ్య, బొమ్మ బాలయ్య ,సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
