ప్రజాపాలన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెనువెంటనే పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి19 (ప్రజాబలం) ఖమ్మం
ప్రజాపాలన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెనువెంటనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందింరలో శాఖల వారీగా అందిన దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఏ శాఖలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు హైద్రాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాకు చెందిన అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై సత్వర చర్యలు చేపట్టి తీసుకున్న చర్యలు తెలియజేయాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రతేక శ్రద్ధ కనబర్చాలన్నారు సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్, ఖమ్మం ఆర్డిఓ గణేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్ సన్యాసయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.