తెలంగాణ పేరిట దోపిడీ కేసీఆర్ కుటుంబీకుల విధానం
మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ మొల్సాబ్
మెదక్కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు లేదని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ మోల్సాబ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబీకుల విధానం దోపిడీ మాత్రమేనని అన్నారు. కేసీఆర్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా కంటక పాలనకు బీఆర్ఎస్ పాలన నిదర్శనం అన్నారు. అణచివేత విధానాన్ని భుజాన వేసుకున్న కేసీఆర్ ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేశారన్నారు. మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాకు చేసింది సున్నా అన్నారు. మెదక్ వెనుకబాటు హరీష్ ప్రధాన కారకుడన్నారు.