ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప మానతావాది

వర్ధమాన నటీనటులను వెన్నంటి ప్రోత్సహం
ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు
(ఆగస్టు 22 చిరంజీవి జన్మదినం సందర్బంగా ప్రత్యెక వ్యాసం)
–వ్యాసకర్త, రచయిత బూర్గుపల్లి కృష్ణ యాదవ్–
67 సంవత్సరాల వయసులో కూడా యువహీరోలకు దీటుగా నటన,డాన్స్, ఫైట్ లలో తన చరిస్మాను ఇంకా కొనసాగిస్తున్నారు కొణిదెల శివశంకర వరప్రసాద్(చిరంజీవి) చిరంజీవి పేరిట దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి.సినీ పరిశ్రమలో ప్రస్తుతం వెలుగొందుతున్న దర్శక, నిర్మాతలు నటీనటులలో చాలామంది చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆగస్టు 22,, 1955లోకొణిదెల అంజనాదేవి, కొణిదెల వెంకటరావు దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్, అతి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించినా సినీ పరి శ్రమలో ప్రవేశించి వెండితెర వెలుగు జిలుగులో తన జీవన ప్రస్థానం కొనసాగించాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులను ఒప్పించి తన కల సకారం కోసం పూ నా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ కోసం ప్రవేశించారు. శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే సినిమాల లో అవకాశం పొందారు 1978లో వచ్చిన పునాదిరాళ్లు చిత్రంతో తన పేరును చిరంజీవిగా మార్చుకొని నట జీవితం ప్రారంభించారు, కానీ అతని రెండవ చిత్రమైన ప్రాణం ఖరీదు చిత్రం మొదట విడుదలైంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో చిన్న చిన్న సైడ్ పాత్రలతో పాటు విలన్ పాత్రను కూడా పోషించారు. నిరంతరం తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. పరిశ్రమకు వచ్చిన ఐదో ఏట ఖైదీ చిత్రంతో వెండితెరపై తనదైన నటన, డాన్స్,ఫైట్ ల లో నూతన వరవడి సృష్టించి. ఇండస్ట్రీ రికార్డు సాధించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లోఖైదీ అయ్యారు. నాటి నుండి నేటి వరకుజయజయాలతో సంబంధం లేకుండా ఇతర ఏ హీరోలకు సాధ్యం కానీ సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో పాటు అత్యధిక ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకునినిర్మాతల పాలిట కల్పవృక్ష మయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు. 1990 దశకంలో భారతసినీ పరిశ్రమంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా రికార్డు సృష్టించారు. సినీ పరిశ్రమంలో ప్రవేశించిన వర్ధమాన నటీనటులను వెన్నంటి ప్రోత్సహిస్తూ, వారు సాధించిన విజయాలను తన విజయాలుగాఆస్వాదిస్తూ వారిని అభినందిస్తూ ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అందుకే కాబోలుఆయనగొప్ప నటుడే కాదు గొప్ప మానతావాది అని కూడా సీని పరిశ్రమ కొనియాడుతున్నది.
చిరంజీవి కుటుంబం,
హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య గారి రెండవ కూతురు సురేఖను 1980 ఫిబ్రవరి 20 తారీకున వివాహమాడారు. సంతానం..సుస్మిత రామ్ చరణ్ తేజ్ శ్రీజ, తమ్ముళ్లు,,నాగబాబు పవన్ కళ్యాణ్ ,చెల్లెల్లువిజయదుర్గ మాధవి, నాగబాబు నటుడిగా నిర్మాతగా, చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్, కుమారుడు రామ్ చరణ్ హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలోఅగ్రస్థానంలో ఉన్నారు. నాగబాబు కుమారుడు సాయి వరుణ్ తేజ్, పెద్ద చెల్లెలు కుమారులు, సాయిధరమ్ తేజ్, వైష్ణవి తేజులు కూడా పరిశ్రమలోనే హీరోలుగా కొనసాగుతున్నారు. సేవా కార్యక్రమాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి నిరాశ్రయులను ఆదుకోవడానికి తన వంతుగా, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాహయంచేయడంలో ముందుంటాడు. ఆపదలో ఉన్న అభిమానులకు, సినీ పరిశ్రమలోని నిరుపేదలకు ఇప్పటికి కూడా నిరంతరం ఆర్థిక సహయం చేస్తూనే ఉంటాడు.కరోనా సమయంలో షూటింగులు ఆగిపోయి ఆకలికి అలమటిస్తున్నజూనియర్ ఆర్టిస్టులకు, నిరుపేదనటీనటులకు, పరిశ్రమలోని ఇతర దర్శక,నిర్మాత, నటీనటుల సహకారంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు అందించి ఆదుకోవడం తో పాటురోగులకు ఉచితంగా మందులు కూడా అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించి కరోనా రోగుల ప్రాణాలు కాపాడడంలో తన వంతు పాత్ర పోషించారు. నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టిన ప్రజలకు నా వంతుగా ఏదైనా సహాయం చేయాలన్న తలంపుతో 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంకు మరియు ఐ బ్యాంకు ఏర్పాటు చేశారు, అభిమానుల ఉత్సాహాన్ని వారిలో ఉన్న సేవా దృక్పథాన్నిపెద్ద ఎత్తున సమాజ సేవ కార్యక్రమాల వైపు మళ్లించడం మెగాస్టార్ చిరంజీవి గారికి తప్ప ప్రపంచ సినీ పరిశ్రమలో మరే ఇతర హీరోకు సాధ్యం కాలేదు. అభిమానులు, సేవా తత్పరుల సహకారంతో బ్లడ్ బ్యాంకు ద్వారా అత్యవసర సమయములో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఉచితంగా రక్తం అందించి నేటి వరకు లక్ష మందికి పైగా ప్రాణాలు కాపాడారు. నేత్ర నిధి ద్వారా 1000మందికి పైగా చూపు రప్పించారు. చిరంజీవిచారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన ,నేత్రదానకార్యక్రమాలునిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరుసగా నాలుగు సంవత్సరాలు అత్యుత్తమ సేవా సంస్థగా రాష్ట్ర ప్రభుత్వం చేత అవార్డులు అందుకున్నారు.

చిరంజీవి గారు అందుకున్న అవార్డులు రివార్డులు
సినీ పరిశ్రమలో,నట కిషోర్,నట భాస్కర, సుప్రీం హీరో, మెగాస్టార్లాంటి బిరుదులు పొందారు.
1987లో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ కు ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణాది నటుడిగా రికార్డు సృష్టించారు.9ఫిలింఫేర్అవార్డులు,రాష్ట్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన నాలుగు నంది అవార్డులు, అందుకున్నారు.చిరంజీవి గారు చేసిన సామాజిక సేవలకు గాను 2006 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది.2006 జనవరి 20న భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2006 నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిరంజీవి గారికి గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠా కూరు గారి చేతుల మీదుగాగౌరవ డాక్టరేట్ అందుకున్నారు.రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా అందుకున్నారు. 2022 సంవత్సరంలో నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగిన 53వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ గా చిరంజీవి గారు అవార్డు అందుకున్నారు. అభిమానులు ప్రేక్షకుల చేత అందుకున్న రివార్డులకు కొదవేలేదు
రాజకీయ ప్రవేశం,,

2007లో చిరంజీవి రాజకీయ పార్టీ స్థాపిస్తున్నారని దినపత్రికల లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది 2018 ఆగస్టు 17న రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లుగా పత్రికా ముఖంగా ప్రకటన విడుదలచేశారు. సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్రంలోని పేదలకు,వెనకబడిన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయమే లక్ష్యంగా 2018 ఆగస్టు 26నాడు తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని, పతా కాన్నిఆవిష్కరించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికలలో 294 స్థానాల్లో (బీసీలకు 105 స్థానాలు కల్పించిన ఏకైక రాజకీయ నాయకుడు )పోటీ చేశారు, 18 స్థానాల్లో గెలుపు, 70 లక్షల ఓట్లు(18శాతం )సాధించారు. అనివార్య కారణాలవల్ల 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసికాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాలోతన విధులను నిర్వహించారు. భారతదేశ చరిత్రలో చిరంజీవి గారు కేంద్ర పర్యటశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పర్యటక శాఖలో జరిగిన అభివృద్ధి అంతకు ముందుగానే అతని తర్వాత గాని జరగలేదు. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి పది సంవత్సరాల తర్వాత సినీ పరిశ్రమలో మళ్లీ అడుగుపెట్టి ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ ఇండస్ట్రీ హిట్ సాధించి సినీ పరిశ్రమలో ఆయన స్థానం పదిలంగానే ఉందని. అభిమానులు,ప్రేక్షకుల గుండెల్లో ఇంకా ఖైదీగా నే బందీ అయి ఉన్నారని నిరూపించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మిశ్రమ ఫలితం ఇచ్చినా వాల్తేరు వీరయ్యతో మరో ఇండస్ట్రీ కీ మరో హిట్టు ఇచ్చాడు. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి అసమాన్యుడిగా ఎదిగి 47 సంవత్సరాలుగా 155 చిత్రాలలో నటించి తెలుగు సిని పరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలనిసినీ పరిశ్రమకు మరెన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల అందించాలనిమనసు పూర్తిగా కోరుకుంటూ…

Leave A Reply

Your email address will not be published.

Breaking