మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 21:
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతీ హోళికేరి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిచారు.
ఈ మేరకు సోమవారం ఉదయం జిల్లాలోని నాగోల్లో ఉన్న అనంతుల రాంరెడ్డి గార్డెన్స్లో నూతన ఎక్సైజ్ పాలసీ 2023–2025కు సంబంధించి లాటరీ పద్దతిన కేటాయించారు. దీనికి సంబంధించి మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, భారతీ హోళికేరి, మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ ఆధ్వర్యంలో లాటరీ పద్దతిన కేటాయించారు. మేడ్చల్ ఎక్సైజ్ సర్కిల్కు సంబంధించి 114 మద్యం దుకాణాలు ఉండగా 7,519 దరఖాస్తులు రాగా మల్కాజిగిరి ఎక్సైజ్ సర్కిల్లో 88 మద్యం దుకాణాలకు గాను 6722 దరఖాస్తులు వచ్చాయి అని తెలిపినారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేటాయింపు ప్రక్రియ లక్కీ డ్రా పద్ధతిన పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking