మంచిర్యాల జిల్లా కేంద్రాన్నీ హెల్త్ హిబ్ గా మార్చి రోగులకు ఉన్నంత వైద్యం అందిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 : మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని హెల్త్ హబ్ గా మార్చి రోగులకు ఉన్నత వైద్యం అందిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు
మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల లోని ఐబీ స్థలంలో అనాలోచితంగా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ భవనంను మాతా శిశు ఆసుపత్రిగా మారుస్తానని స్పష్టం చేశారు.అలాగే ఐటీఐ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని తెలిపారు.కొంత సమయం తీసుకున్నా ఆసుపత్రుల ఏర్పాటు లో వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పారు. మంచిర్యాల నియోజకవర్గం, జిల్లాలో ఎక్కడ గంజాయి అమ్మకాలు,వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నార్కో టీమ్,పోలీస్ ప్రత్యేక బృందాలతో గంజాయి రవాణా,విక్రయాల ఆటకట్టిస్తానని హెచ్చరించారు. బెల్టుషాపులలో మద్యం అమ్మకాలను నిషేధించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెరువులను నింపడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ లు స్వచ్చందంగా కాంగ్రెస్ లో చేరి అధికార మార్పిడి కోరుకొని అవిశ్వాసంకు ముందుకు వచ్చారని వివరించారు. ప్రభుత్వం మారిన తర్వాత బీఆరెస్ పై ఎలాంటి కక్ష సాధింపు ఉండదని ప్రజా ధనం దుర్వినియోగం చేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారి పట్ల చట్టపరంగా శిక్షలు తప్పవని అన్నారు.పేద ప్రజలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. ఎన్నికల సమయంలో హజీపూర్ కు ప్రచారంకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుకు అత్తగారి ఊరు గుర్తుకు రావడం విడ్డురంగా ఉందని ఎద్దేవాచేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి,రాష్ట్ర నాయకులు మంచిర్యాల జిల్లా నాయకులు,మున్సిపల్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking