సోలార్ ప్యానల్స్ తో వ్యవసాయ రైతులకు ఉపాధి
టాటా ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సమావేశం
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 05 : గుత్తి కోయ ప్రాంతాలలోని పిల్లలకు ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో టాటా ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.
గుత్తి కోయ ప్రాంతాలలో రక్తహీనత, పౌష్టిక ఆహారా లోపంతో బాధపడే చిన్నారులకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఆరోగ్య పరీక్షలు, సేవలు అందించే కార్యక్రమాలు చేపట్టే విధంగా చూడాలని టాటా ట్రస్ట్ సభ్యులలో జిల్లా కలెక్టర్ ఈ సమావేశం లో చర్చించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులు పంట పొలాలలో సోలార్ ప్యానల్స్ వినియోగించడం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని, ఆసక్తి కలిగిన రైతులకు సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, వాటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనిన, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, మైనారిటీ సంక్షేమ అధికారి ప్రేమలత , టాటా ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ రీజనల్ మేనేజర్ భగీరథ గోప్, ఏరియా మేనేజర్ వెంకట్రావు మంత్ తదితరులు పాల్గొన్నారు.