– ప్రతి ఒక్కరి భాధ్యత పర్యావరణాన్ని రక్షించాలి
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 05 :- మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో మొక్కను నాటిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు హైదారాబాద్ మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లు, మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది మానవ జాతి మనుగడకు తొలి మెట్టు చెట్టు అని మనమందరం భాధ్యత తీసుకొని మన పరిసరాల చుట్టూ మన ఇళ్ల చుట్టూ మీరు పని చేసే కార్యాలయ ఆవరణం లో చెట్లను నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కంకణ బద్దులం కావాలని మంత్రి గారు అన్నారు