బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు సన్మానం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 21 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సై లుగా పనిచేసి ఎస్సైలుగా పదోన్నతి పొంది బదిలీపై మంచిర్యాల వెళ్తున్న స్వామిల్ పాల్,రాములు, అదేవిధంగా బదిలీపై వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ గోవింద్ లను పోలీస్టేషన్ ఎస్సై సతీష్ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించరు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకంటే చాలా కీలకమైనదన్నారు. ఇంతకాలం ఇక్కడ చాలా క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మన స్టేషన్కి గర్వకారణమని ఇప్పుడు వెళ్లే చోట కూడా ఇంతకన్నా రెట్టింపు పెరు తెచ్చుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్సై-2లు తానాజీ, పానాస రాజయ్య, హెడ్ కానిస్టేబుల్ లు సుభాష్, రవీందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking