జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 21
జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణమాసంలో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రావణ మాసంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్క పొద్దులు ఉంటూ పోచమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలోని గొడ్డు గోదా బాగుండి, పాడి పంట మంచిగా పాండాలని గ్రామం సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.