ఉచిత వైద్య శిబిరం విజయవంతం

– వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లిలో..
– ‘ఆదిత్య’ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వారి సహకారంతో..
– యువకుడు ప్రశాంత్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు
– ఫ్రీ హెల్త్ క్యాంపునకు పెద్ద సంఖ్యలో హాజరైన జనం

హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 21

 

వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామంలో బుధవారం ప్రశాంత్ పటేల్ మద్దుల ఆధ్వర్యంలో ‘ఆదిత్య’ ఆస్పత్రి వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ హెల్త్ క్యాంపునకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ‘సీజనల్’, ‘వైరల్’ వ్యాధుల ముప్పు పొంచిన నేపథ్యంలో ఊరి ప్రజలు బాగుండాలనే మంచి ఆలోచనతో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన ప్రశాంత్‌ను గ్రామస్తులు అభినందించారు.

సేవా మార్గంలో ప్రశాంత్
తన ఊరు బాగుండాలనే ఆలోచనతో ప్రశాంత్ సేవా మార్గంలో ముందుకెళ్తున్నారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి తన గళాన్ని వినిపిస్తూనే.. పరిష్కారానికి తన వంతు కృషి, ప్రయత్నాలు ప్రశాంత్ చేస్తున్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి మొదలుకుని నేటి వరకు..భవిష్యత్తులోనూ సేవా మార్గంలోనే ఉంటానని ప్రశాంత్ వెల్లడించారు. కరోనా సమయంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీ మొదలు..గ్రామంలోని రోడ్డు సమస్య, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. లస్మక్కపల్లి చెక్ డ్యాం బాగు చేయాలని తన గళాన్ని వినిపించారు. గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరు వైపులా ఉన్న చెట్లు రోడ్డును కమ్మేసినట్టు ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ప్రశాంత్..ఇటీవల తన సొంత డబ్బుతో వాటిని తొలగించారు. రోడ్డు మార్గంలో మొరం సైతం పోయించి… స్వయంగా ఆయనే చదును చేసి ప్రజలు వెళ్లే ‘దారి’ బాగుండాలని పనులు చేశారు.

శభాష్..ప్రశాంత్
లస్మక్కపల్లి గ్రామానికి రవాణా సదుపాయాలు లేవు. ప్రైవేటు వాహనాల ద్వారానే జమ్మికుంట పట్టణానికి లేదా కరీంనగర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనం అనారోగ్యం బారిన పడితే వారి వ్యాధులు నయం చేయడంతో పాటు పలు విషయాల పట్ల అవగాహన కల్పించాలని ప్రశాంత్ సంకల్పించారు. జమ్మికుంట పట్టణంలోని ‘ఆదిత్య’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వారిని సంప్రదించి..తమ గ్రామంలో ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించాలని కోరారు. వారు ఓకే చెప్పడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసి..బుధవారం క్యాంపు సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించారు.

వ్యాధుల పట్ల అవగాహన కల్పించిన ‘ఆదిత్య’ వైద్యులు
ప్రస్తుత వానాకాలం నేపథ్యంలో ‘సీజనల్’, ‘వైరల్’ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు సూచించారు. ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ప్రజలకు తగు వైద్యం అందించారు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ‘ఆదిత్య’ వైద్యులు ప్రజలకు తెలిపారు. వైరల్, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ‘ఆదిత్య’ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఎండి ఫిజీషియన్, విజేతరెడ్డి చాతి వైద్య నిపుణులు, పి సుందరి గైనకాలజిస్ట్ పేషెంట్స్‌కు తగు వైద్యం అందించారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, వారికి తగు వైద్య సూచనలు ఇవ్వడంతో పాటు మందులను సైతం ఉచితంగా అందజేశారు. ‘ఆదిత్య’ ఆస్పత్రి సిబ్బంది గ్రామస్తులకు వైద్యులు సూచించిన మందులను ఉచితంగా అందజేశారు. తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ‘ఆదిత్య’ ఆస్పత్రి నిర్వాహకులు దేవేందర్‌రెడ్డికి ప్రశాంత్, మాజీ సర్పంచ్ సుజాత లక్ష్మణ్ ఊరి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలువల శంకర్‌రెడ్డి, మొండయ్య, దాసరపు ఇసాక్, శ్రీను, రమేశ్, మురళి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking