కొండాపూర్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ కొండాపూర్ సర్వే నెంబర్ 59 లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇటీవల సుప్రీంకోర్టు లో ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రావడంతోటి శనివారం ఉదయం నుంచి బిక్షపతి నగర్ లోఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రెండున్నర దశాబ్దాల నుంచి ఈ భూమిపైన వివాదం నడుస్తూ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఈ స్థలం ప్రభుత్వందే అని తీర్పు రావడంతో స్థలం స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 59లో ఉన్న 36 ఎకరాల స్థలాన్ని 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడకు చేరుకొని ఆందోళన చేసారు.