దేవుళ్ళ రూపాలలో మానవుల విగ్రహాలను నిషేధించాలి

 

భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి నాగేష్ యాదవ్
ప్రెసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్

ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జూలై 04 (ప్రజాబలం) ఖమ్మం దేవుళ్ళ రూపంలో మానవుల విగ్రహాలను పెట్టడం వలన దేవుళ్ళని అవమానించినట్లు అవుతుందని , ప్రజల యొక్క విశ్వాసం ను అవహేళన చేసినట్లు అవుతుందని , రాబోయే రోజులలో ఈ సంస్కృతి పెడదారి పట్టే అవకాశం ఉందని , దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒక ప్రత్యేక చట్టం తీసుకుని వచ్చి దేవుళ్ళ రూపంలో మానవుల విగ్రహాలను నిషేధించాలని భారత యాదవ సంగతి రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్ యాదవ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్ , జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు , డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు . స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కొంతమంది పని కట్టుకొని రాజకీయ కుట్ర కోణంలో దేవుళ్ళ రూపాలను మానవులకు అంటగట్టి విగ్రహాన్ని రూపొందించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు . జాతీయ రాజకీయాలను ప్రభావితం ప్రభావితం చేసి , తెలుగు ఛాతిఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు ఎవరికి వ్యతిరేకం కాదని , ఆ విగ్రహాన్ని దేవుళ్ళ రూపంలో ఆవిష్కరించరాదని న్యాయస్థానం స్టే విధించి తీర్పు ఇచ్చినప్పటికీ , చట్టాన్ని ఉల్లంఘించి విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని , దీనిపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో కాస్త యాదవ సంఘం నాయకులు లిక్కి కృష్ణారావు , అల్లిక సంతోష్ , నాగరాజు దాసరి నాని యాదవ్ గజ్జి రవి , గజ్జి కోటేశ్వరరావు , పచ్చిపాల వీరబాబు , దాసరి ఉదయ్ , జి రామారావు , అప్పారావు , మల్లికార్జునరావు , హరికృష్ణ , రోహిత్ , ఉపేందర్ , బి.శ్రీను , సురేష్ , నాగరాజు , నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking