“గ్రావిటీతో నీళ్లు వస్తుంటే.. చెన్నూరు ఎత్తిపోతలకు సీఎం ఎందుకు శంకుస్థాపన చేస్తున్నారు? అనే అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని, తెలంగాణ జల సాధన సమితి ప్రెస్ క్లబ్ సోమాజిగూడ హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ వినాయక రెడ్డి అధ్యక్షత వహించగా, నైనాల గోవర్ధన్ (తెలంగాణ సమితి నాయకులు) చెన్నూర్ ఎత్తిపోతులకు ప్రత్యామ్నాయంగా గ్రావిటీ ప్రత్యామ్నాయల పై టోపో సర్వే ఆఫ్ ఇండియా మాప్స్ తో ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ ఉత్తర కాలువ సెకండ్ ఫేస్ నెహ్రూ ప్రణాళిక ప్రకారం అదే ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన రెండవ దశ మందాకిని కాలువతో చెన్నూరు ప్రాంతానికి అంతటికి గ్రావిటీ నీరు ఇవ్వవచ్చన్నారు. అన్నారు. డిపిఆర్ పూర్తయిన కుప్టి ప్రాజెక్ట్, కడెం మరియు ఎల్లంపల్లి, తుమ్మిడిహెట్టితో కూడా ఈ ప్రాంతానికి నీరివ్వవచ్చు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన గూడెం ఎత్తిపోతలు 55 సార్లు విఫలమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 100 ఎత్తిపోతలు విఫలమైనాయన్నారు. రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విటల్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నలువైపులా భారీ నదులున్న, జిల్లాలో అన్నీ ఉన్నా , అల్లుని నోట్లో శని ఉన్నట్లు ఆ నీరు జిల్లా ప్రజల బతుకులను మార్చడం లేదన్నారు. చెన్నూరుకు వెళ్లే గ్రావిటీ కాలువ లను సర్వే ఆఫ్ ఇండియా టోపో మ్యాప్స్ ద్వారా వివరించి చెప్పారు. కోదండరాం మాట్లాడుతూ గ్రావిటీ కాలువతో నీళ్లు అందించాలి అన్నారు. తమ్ముడిహెట్టిని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాలన్నారు. ఆకునూరి మురళి రిటైర్డ్ IAS అధికారి, కేసీఆర్ పెట్టే ఎత్తిపోతలన్ని భారీ వ్యయంతో కూడుకున్నవన్నారు. పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఎత్తిపోతలన్నీ విఫలమైనాయని అనుభవాలు నిరూపిస్తున్నాయన్నారు. కాలేశ్వరం భారీ ఎత్తిపోతలు ఒక విఫల పథకం అన్నారు. పంట సాగు చేస్తే 20 వేల రూపాయల లాభం వస్తే, కాలేశ్వరం తో నీళ్లిస్తే ఎకరాకు లక్ష రూపాయల ఖర్చు వస్తుంది అన్నారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదు కానీ, అప్పులను, అవినీతిని విపరీతంగా పెంచిందన్నారు. వేములపల్లి వెంకట్రామయ్య సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే అత్యంత వెనకబడ్డది, 22 లక్షల ఎకరాల భూమిలో కేవలం మూడున్నర లక్షల అతి తక్కువ భూమికే సాగునీటి వసతి ఉంది అన్నారు. ఆదివాసులకు నేటికీ సాగు నీరు కు నోచుకోలేదన్నారు. కోదండ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ నాయకులు) మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటలకు చేతులకు పొంతన లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత తమ్ముడిని పాతిపెట్టి కెసిఆర్ అన్యాయం చేశారు. నీటిపారుదల పేరిట దోచుకుంటూ అవినీతి చేస్తున్నారన్నారు. చెన్నూర్ లిఫ్టులు ఆపి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలన్నారు. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఎత్తిపోతలు కాకుండా , ఖర్చులేనటువంటి గ్రావిటీ పథకాలకు ప్రణాళికలు వేసి అవకాశమున్నా ,ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. చెన్నూరుకు నిరంధించే నెహ్రూ ఎన్టీఆర్ స్టేజ్ -2 పథకాన్ని చేపట్టాలన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ ఎత్తిపోతలన్నీ అనేక రకాల మెకానికల్ యంత్ర ఎలక్ట్రికల్ పైపుల నాణ్యత సమస్యల వల్ల వ్యయం ఎక్కువై అన్ని విఫలమవుతున్నాయి అన్నారు. ఎత్తిపోతులు పెట్టడం ఆపి సాధ్యమైన గ్రావిటీ పథకాలను పరిశోధించి నిర్మాణం చేపట్టి ఖర్చు లేకుండా నీరు బాగున్నారు. సిపిఐ నాయకులు పశ్య పద్మ గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో, కొండేటి సత్యనారాయణ ఆదిలాబాద్ అభివృద్ధి వేదిక అధ్యక్షుడు, మన్నారం నాగరాజు తెలంగాణ లోక్సత్తా , రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ. బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్, జలసాధన సమితి సారయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్లు మైనారిటీ నాయకులు పీస్ అండ్ జస్టిస్ మహిళా ప్రతినిధులు తదితర నాయకులు పాల్గొన్నారు.