క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె నారాయణరావు

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నందు ఘనంగా ప్రారంభమైన స్తంభాద్రి ప్రీమియర్ లీగ్ 6 క్రికెట్ పోటీలు స్తంభాద్రి మెడికల్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గా డాక్టర్ కుసుమరాజు రవి కుమార్ ఆధ్వర్యంలో స్తంభాద్రి ప్రీమియర్ లీగ్ 6 నిర్వహిస్తున్నఈ క్రీడలను ప్రారంభించడాని కి ముఖ్యఅతిథిగా ఖమ్మం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కే నారాయణ రావు జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ డాక్టర్ ఎం జీవి ప్రవీణ్ డాక్టర్ ఆర్ రవి కుమార్ డాక్టర్ జంగాల సునీల్ కుమార్ డాక్టర్ నందనందన్ డాక్టర్ గోపగాని సురేందర్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు ఖమ్మం నగరంలోని ప్రముఖ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కే నారాయణ రావు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత జాతీయ గీతం ఆలపించి తర్వాత క్రీడలను ప్రారంభించారు.ఈసందర్బంగా నారాయణరావు మాట్లాడుతూ ఖమ్మం నగరం లోని ప్రయివేటు హాస్పిటల్ స్టాఫ్ అందరిని ఐక్యం చేసే పనిలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడలు ఖమ్మం వైద్య రంగానికి మంచి పరిణామమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మరింత ఐక్యత తో పనిచేసేందుకు స్తంబాద్రి మెడికల్ అసోసియేషన్ కు ఖమ్మం ఐఎంఏ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

స్తంబాద్రి మెడికల్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డా. కుసుమరాజు రవి కుమార్ మాట్లాడుతూ ప్రయివేట్ హాస్పిటల్ లో పనిచేసే ప్రతి ఉద్యోగి ఆయమ్మ నుండి మొదలుకుని మేనేజర్ స్థాయి ఉద్యోగి వరకు ఐక్యమత్యమే లక్ష్యంగా ఈ అసోసియేషన్ ఏర్పడిందని అన్నారు.2017 లో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటి వరకు 5 దఫాలుగా క్రీడలు నిర్వహించుకుని 6 వ దఫా ఇప్పుడు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ క్రీడలు నిర్వహించుటకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపుతున్నామని అన్నారు. ఈ విదంగా సేకరించిన విరాళాల ద్వారా క్రీడలు నిర్వహించడం కాకుండా మెడికల్ ఫిల్డ్ లో పనిచేసే నిరుపేద కుటుంబాలకు నిరుపేద పిల్లల చదువుల కోసం మరియు అనారోగ్యంతో బాధపడే వారికి ఆర్థిక తొడ్పాటుకు ఉపయోగిస్తున్నామని అన్నారు. అలాగే మొన్న ఖమ్మం నగరానికి వచ్చిన మున్నేరు వరదబాధిత మెడికల్ స్టాఫ్ కుటుంబాలకు కూడా ఆర్థికంగా మరియు వస్తురూపేణా సహకరించడం జరిగిందని అన్నారు. అలాగే రాబోయేరోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఈ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో స్తంబాద్రి మెడికల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు జాగర్లమూడి ప్రసాద్ విష్ణు నరేష్ గౌస్ పాషా సాధిక్ హమీద్ అర్కా వెంకట్, వీర కుమార్ వెంకట్ శ్రావణ్ నరేష్ సుధీర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking