తాజా మాజీ సర్పంచుల JAC తెలంగాణ రాష్ట్రం. పేరుకే ప్రజా పాలన /నడిచేదంతా కార్పొరేట్ పాలన

రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్

సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయకుంటే పల్లె బట కార్యక్రమం చేపట్టి ప్రజల మధ్యకు వెళ్ళుతాం

డిసెంబర్ 9వ తారీకు నుండి జరగబోవు అసెంబ్లీ సమావేశాలలో సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడాలని ప్రతిపక్ష నాయకులందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం కక్ష సాధింపు చర్యగా మేం భావిస్తున్నాం.

 

గత సంవత్సర కాలం నుండి వినతి పత్రాలు ఇస్తూ శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము కానీ ఎలాంటి స్పందన లేదు.

ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతుంది, అదే విధంగా గత ప్రభుత్వ అప్పులకు ప్రతినెల 5000 కోట్ల రూపాయల మిత్తులు కూడా కట్టడం జరుగుతుంది.

కానీ సర్పంచులకు రావాల్సిన 1,000 కోట్లు మాత్రం విడుదల చేయకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం.

సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులను ఏకం చేసి అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగింది.

అసెంబ్లీ సమావేశాలలో సర్పంచుల పెండింగ్ బిల్లులలు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా పల్లెబాట కార్యక్రమం చేపట్టి సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులో మరియు ప్రభుత్వం యొక్క ఆరు గ్యారెంటీ లపై ఎండ ఎండగడతామని హెచ్చరించడం జరిగింది.

అయినా ఈ ప్రభుత్వంలో స్పందన రాకపోతే డిసెంబర్ 27 తారీకు నాడు అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేయడం జరిగింది.
సంవత్సరం గడిచి సందర్భంగా ప్రజా పాలనలో ప్రజా ఉత్సవాలు అని జరుపుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి లేదని చెప్పేసి ఎద్దేవ చేయడం జరిగింది.

ఒకవైపు రాష్ట్ర ప్రజలు జీవితాలు రోడ్ల మీద పడ్డాయి, అదేవిధంగా ఆరు గ్యారెంటీల అమలు లేదు, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో చనిపోయినటువంటి పిల్లల బాధలు ఒకవైపు ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు చేసినట్టు విజయోత్సవాలు చేసుకోవడం ఆస్పేస్పదంగా ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అకెనపెల్లి కరుణాకర్, చెన్నమనేని స్వయంప్రభ, దుమ్మ అంజయ్య, గున్నాల లక్ష్మణ్, కెంద గంగాధర్, మల్యాల దేవయ్య, ఆరె మహేందర్, లింగంపల్లి కరుణాకర్, రాసురి రాజేష్, కాదస్ సంతోష్, రంగు రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking