బొబ్బిళ్ళపాటి బాబురావు
కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మం ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 12/ 12/ 24 తేదీన విధారణ కమిషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ జస్టిస్ షామీమ్ అత్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ పర్యటన విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు బొబ్బిళ్ళపాటి బాబురావు పిలుపునిచ్చారు షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై వివర్ణాత్మక అధ్యయనం కోసం ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని బహిరంగ విచారణ కు 12/ 12/ 24న ఖమ్మం జిల్లాకు విచ్చేయుచున్నారు కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్సీ కుల సంఘ నాయకులు, ఉప కులాల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ విచారణకు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నందు హాజరై తమ తమ వినతులు ఇవ్వాలని కోరుచున్నాము యొక్క విచారణ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏక సభ్య కమిషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ జస్టిస్ షామీమ్ అత్తర్ పాల్గొని వినతులు స్వీకరిస్తారు