త్వరలో పోరాట కార్యాచరణ
పెన్షనర్ల సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రబాబు
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మం అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన బాట పట్టక తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అర్విణి రాజేంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల -సమస్యల పరిష్కారం పట్ల నాన్చివేత ధోరణిని అవలంభిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం -ఆధ్వర్యంలో పెన్షనర్ల సదస్సు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు పరిశ పుల్లయ్య -అధ్యక్షతన జరిగిన సభలో రాజేంద్రబాబు మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించి నాలుగు విడతల డిఏ పెండింగ్లో ఉందని -సత్వరం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు నగదు రహిత వైద్యం గురించి పదే పదే చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదని, వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నగదు రహిత వైద్యం అందక పెన్షనర్లు తీవ్ర -ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రబాబు తెలిపారు. తక్షణం పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఇటీవల కాలంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన పెన్షనర్ల బెన్ఫిట్స్స అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని మార్చిలో పదవి విరమణ పొందిన వారికి సైతం ఇప్పటి -వరకు బెన్ఫిట్సన్స్ను ప్రభుత్వం అందించడం లేదని పదవి విరమణ పొందిన వెంటనే ఆర్థిక ఇతర విషయాలను -అమలయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. పిఆర్సి అమలులో సైతం జాప్యంజరుగుతుందని ప్రస్తుత ముఖ్యమంత్రి పిఆర్సిపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేవిధంగా సత్వరం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. పై -డిమాండ్ల సాధనకు తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో త్వరలో ఆందోళనబాట పడతామని ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించుకున్నట్లు రాజేంద్రబాబు తెలిపారు. ఇతర సంఘాలను కలుపుకుని జేఏసిగా ఏర్పడడం జరిగిందని ఉమ్మడి ఎజెండాతో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాడుతుందన్నారు. ఈ సదస్సులో పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి నర్సింగరావు, సీనియర్ ఉపాధ్యక్షులు వి. రాంమనోహర్, దేశ్ పాండే, వి. -మనోహర్రాజు, నాగిరెడ్డి తదితరులు ప్రసంగించగా కొల్లికొండ శరత్ బాబు సభకు స్వాగతం పలికిన ఈ సమావేశంలో కె. -సుధీర్ బాబు యాదయ్య, అంజయ్య సూర్యనారాయణ ఆళ్ల రామారావు నర్సయ్య కె. కృష్ణమూర్తి వెంకటేశ్వర్లు, రవికుమార్, -భాస్కరాచారి, శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముందు మహాత్మగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు -పూలమాలలు వేసి నివాళులర్పించారు