జి.ఒ 89 అమలు చేయండి చిరు వ్యాపారులను రక్షించండి

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 4 ఏప్రిల్ 2025
చిరు వీధి వ్యాపారుల రక్షణార్తం వారి జీవనోపాధి సరళంగా సాగడానికి అనుకూలముగా భారత పార్లమెంట్ యాక్ట్ 2014 లో అమలు పర్చడం జరిగినది అట్టి చట్టానికి పూర్తి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2020 సంవత్సరంలో జూన్ నెల 10 వ తేదీన గవర్నమెంట్ ఆర్డర్ 89 విడుదల చేయడం జరిగినదని ది సిటిజన్స్ కౌన్సిల్ ముఖ్య కార్యదర్శి షేక్ ఆరీఫ్ మొహమ్మద్, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి ఉపెందర్నాథ్ రెడ్డి, కోశాధికారి దిలీప్ కక్కడ్, కమిటీ సభ్యులు బొడ్డు శ్రీధర్, సుమనళిని తది తరులు మునిసిపల్ కమిషనర్ ను కలసి మణికొండ మున్సిపాలిటీ వారు తలపెట్టిన తాయి బజార్ వసూళ్లు చట్ట విరుద్ధమని, వీధి వ్యాపారుల రక్షణ పేరుతో వారిని భక్షణ కావిస్తున్నారని కావున మణికొండ మున్సిపాలిటీ యాక్షన్ ను కాన్సల్ చేయమని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking