సర్వైకల్ క్యాన్సర్ నివారణలో రాందేవ్ రావు ఆసుపత్రి మరో ముందడుగు

 

సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ పూర్తిగా నివారణ

కూకట్పల్లి (ప్రజాబలం ) ఏప్రిల్ 04 :
సమాజానికి సేవ చేయడంలో రాందేవ్ ఆసుపత్రి మరో ముందడుగు వేసింది. నేటి బాలలే రేపటి పౌరులన్న మహాత్మా గాంధీ నినాదంతో రాందేవ్ ఆసుపత్రి కార్నర్ స్టోన్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ సంయుక్తంగా శుక్రవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. రిక్షా పుల్లర్స్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు సుమారు 200 మంది పాల్గొని ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు విక్రం దేవ్ మాట్లాడుతూ నేటి బాలికలను ఆరోగ్యవంతంగా పెంచితే భవిష్యత్ తరాలు, సమాజం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాయన్నారు. పేషెంట్ కి ప్రాణాపాయ స్థితి లో కృత్రిమం గా శ్వాస ను అందించే వెంటిలేటర్ మానిటర్ తో కలిపి రూ. 24 లక్షల రూపాయలను కార్నర్ స్టోన్ సంస్థ ఆసుపత్రికి విరాళం ప్రకటించిందన్నారు.అనంతరం మీరా రావు మాట్లాడుతూ సమాజంలో ని నిరుపేదమహిళలు స్త్రీ సాధికారతను సాధించాలని సూచించారు. సాఫ్ట్ వేర్ సంస్థ నిర్వాహకులు అభిషేక్ గుప్త మాట్లాడుతూ రాందేవ్ రావు ఆస్పత్రి యాజమాన్యం చేస్తున్న అనేక వైద్య, సామాజిక సేవలకు అభినందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులను అభిషేక్ గుప్తా ఘనంగా సన్మానించారు. ఆస్పత్రి ఎండి డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ను ప్రతి బుధ, శనివారాలలో ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామన్నారు. సర్వైకల్ క్యాన్సర్ ను నివారించడంలో రాందేవ్ ఆసుపత్రి గత రెండు సంవత్సరాలుగా కృషి చేస్తుందన్నారు.వ్యాక్సినేషన్ అనేది ప్రాథమిక నివారణ అని, హెచ్ పి వి కోర్టేస్ట్ అనేది రెండో నివారణ వీటి మీద కూడా అతి తక్కువ రుసుముతో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నిరుపేదల ఆరోగ్యానికి అయ్యే అధిక ఖర్చులను నివారించడానికి రాందేవ్ రావు ఆసుపత్రి ఎప్పుడు తన వంతు కృషి చేస్తుందన్నారు. అనంతరం డాక్టర్ ఛాయాదేవి మాట్లాడుతూ రాందేవ్ రావు ఆసుపత్రిలో పనిచేయడం నాకు ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తుందన్నారు. రాందేవ్ రావ్ ఆస్పత్రిలో ఇలాంటి మంచి కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని ప్రశాంత్ రెడ్డి, అపర్ణ రావులు అన్నారు.ఉషశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్నర్ స్టోన్ సాఫ్ట్ వేర్ సంస్థ నిర్వాహకులు అభిషేక్ గుప్తా, కిరణ్ తనికెళ్ళ, భార్గవి, కె నిశిల్, పవన్,కోర్ కమిటీ సభ్యులు హర్ష పీటర్ జై కార్య, సాయి మహేష్, ప్రణీత కిరణ్ వెంకటేష్ సందీప్ హరీష్, దేవేంద్ర నికిత, హరి చైతన్య మనోహర్, నందిని తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking