నిర్మల్ జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలిసి ఆయన పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై చీఫ్ సూపెరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలో ప్రశాంత వాతావరంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇ నెల 28 నుండి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 23 కేంద్రాలలో 13345 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని అన్నారు. అలాగే మార్చి 18 నుండి ఏప్రిల్ 02 వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ఇందుకోసం జిల్లాలో 47 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి కేంద్రంలో సి.సి.కేమేరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం ఇవ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. మారుమూల గ్రామాలనుండి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయా రూట్లలో అవసరమైన బస్ లను నడపాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించాలని, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు పరీక్షా సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా చూడాలని,అలాగే పరీక్షా సమయం పూర్తీ అయినా తరువాతనే విద్యార్థులను బయటకు పంపాలన్నారు.స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, స్మార్ట్ వాచీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలో అనుమతించరాదనీ సూచించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలనీ ఆదేశించారు. పటిష్ట బందోబస్తు మధ్యన ప్రశ్న,జావాబు పత్రాలను సంబంధిత కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పరీక్షా సమయాలలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలనీ అన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటుచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పరీక్షలను నిర్వహించాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ గంగయ్య, ఆర్డీఓలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, డి.ఐ.ఓ పరశురామ్, చీఫ్ సూపెరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking