తూప్రాన్ సంతోష్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ 6 వ వార్షికోత్సవ వేడుకలు.

హాజరైన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు’ వైద్యులు.

తూప్రాన్, ఫిబ్రవరి 24 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ లోని సంతోష్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఎండి
డాక్టర్ అసోసియేషన్ సమన్వయ కర్త సంతోష్ డాక్టర్ కల్లూరి సంతోష్ ఆధ్వర్యంలో డెంటల్ క్లినిక్ లో ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధులుగా మెదక్ జిల్లా ఎంపీపీలపోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, నాయకులు శేఖర్ గౌడ్ శ్రీనివాస్ బజే వేంకటేశ్ ,సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు హాజరై కేకు కట్ చేసి డాక్టర్ సంతోషంను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎంపీపీలపోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ వైద్య వృత్తిలో పేదలకు సేవలందిస్తూ డాక్టర్ సంతోష్ మంచి పేరు సంపాదించుకున్నాడని
మెదక్ జిల్లా తూప్రాన్ లోని నర్సాపూర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన సంతోష్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లో అత్యంత అరుదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్తమ సేవలందించి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి
కృషి చేస్తున్నాడని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ ప్రజలందరూ అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి, నోటి క్యాన్సర్ రాకుండా దంతాలను బ్రష్ తో శుభ్రంగా కడుక్కోవాలి అని అన్నారు. దంత క్షయం అనేది ఒక రకమైన దీర్ఘకాలిక నోటి వ్యాధి, ఇది మానవ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. ఈ నోటి వ్యాధిని ఎదుర్కోవడానికి దంతవైద్యులు మరియు పరిశోధకులు దశాబ్దాలుగా కష్టపడుతున్నప్పటికీ, దంత క్షయాల సంభవం మరియు ప్రాబల్యం చాలా ఎక్కువగానే ఉన్నాయి. దంత క్షయాల నిర్ధారణ మరియు వర్గీకరణ ఆధారంగా క్షయాల నివారణ మరియు నిర్వహణ యొక్క క్లినికల్ క్లిష్టత అంచనా వ్యవస్థ స్థాపించబడింది. దంతవైద్యులు నోటి పరీక్షను నిర్వహించాలి మరియు ప్రతి సందర్శనలో దంత రికార్డులను ఏర్పాటు చేయాలి. క్షయ ప్రమాద అంచనా మరియు క్యారియస్ లెసియన్ యాక్టివిటీ ఆధారంగా చికిత్స ప్రణాళికను రూపొందించినప్పుడు, నోటి సూక్ష్మ జీవావరణ సమతుల్యతను తిరిగి పొందడానికి, క్షయ పురోగతిని నియంత్రించడానికి మరియు క్యారియస్ దంతాల నిర్మాణం మరియు పనితీరును పునరుద్ధరించడానికి మేము రోగి-కేంద్రీకృత మరియు వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికను రూపొందింస్తాము అన్నారు. క్షయాల నిర్వహణపై ఆధారపడి ఉంటాయి. ఈ నిపుణుల ఏకాభిప్రాయం ప్రధానంగా క్షయ ప్రమాద అంచనా, క్షయ చికిత్స కష్టాల అంచనా మరియు దంత క్షయాల చికిత్స ప్రణాళికను చర్చిస్తుంది, ఇవి మొత్తం జీవిత చక్రంలో క్షయాల నిర్వహణలో అత్యంత ముఖ్యమైన భాగాలు అని అన్నారు.


తూప్రాన్ లోని నర్సాపూర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన సంతోష్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లో అత్యంత అరుదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్తమ సేవలందించి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్స్’ ప్రజా ప్రతినిధులు నరేష్ శేఖర్ గౌడ్ బాజే వెంకటేష్ పైనమ్ సందీప్. నవీన్ ధనుష్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking