ఎల్లంపల్లి ప్రాజెక్టు లో నీటి నిలువ దగ్గు మొఖం పట్టడంతో తాగునీటి సమస్య ఏర్పడకుండా సకాలంలో స్పందించారు

 

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 27 : మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గు మొఖం పట్టడంతో మంచిర్యాలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా సకాలంలో స్పందించారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిలువలుపడిపోయి మంచిర్యాల నియోజకవర్గానికి సరఫరా చేసే పంపు హౌస్ కు భూగర్భనీరు అందకుండాపోయింది.నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరం కలగవద్దని భావించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తక్షణం స్పందించి అధికారులను పురమాయించారు. గురువారం మున్సిపల్ అధికారులు,చైర్మన్,వైస్ చైర్మన్,కౌన్సిలర్లు,హాజిపూర్ మండల నాయకులు,కాంగ్రెస్ శ్రేణులు ఎల్లంపల్లికి వెళ్లారు. పంపు హౌజ్ వరకు నీటి కాలువను తవ్విస్తున్నారు. నిరంతరం పంపు హౌస్ కు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ దీపక్ కుమార్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు లో ఉన్న మిషన్ భగీరథ పంపు హౌస్ ను సందర్శించి నీటి మల్లింపు పనులను పరిశీలించారు.నీటి ఎద్దడి రాకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking